: అప్పు తీసుకుని చదువుకునే వారికి చిదంబరం చిరు కానుక
రుణం తీసుకుని ఉన్నత చదువులు చదువుకుంటున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు చిదంబరం కాస్త ఊరట కల్పించారు. 2009 మార్చి 31 వరకు విద్యా రుణాలను తీసుకుని.. 2013 డిసెంబర్ 31 నాటి వరకు వాటిపై వడ్డీ కూడా కట్టలేని వారి భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అయితే, ఈ ఏడాది జనవరి నుంచి వడ్డీని విద్యార్థులే సమయానికి కట్టుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల 9 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వంపై రూ. 2,600కోట్ల భారం పడుతుంది. పదేళ్ల కిందట కేవలం వేల సంఖ్యలోనే విద్యారుణాలను తీసుకోగా.. 2013 డిసెంబర్ నాటికి 25,70,254 మంది విద్యార్థులు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ. 57,700కోట్ల మేర రుణాలను పొందారని చిదంబరం తెలిపారు.