: 2013 అత్యాచార నిరోధక బిల్లుకు ఆమోదం


ఢిల్లీలో `నిర్భయ` సామూహిక అత్యాచారం నేపధ్యంలో కేంద్రం క్రిమినల్ చట్టంలో మార్పులు తేవాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఫలితంగా క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు - 2013 పేరుతో కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచింది. దీనిపై నిన్న లోక్ సభలో విస్తృతమైన చర్చ జరిగింది.

విపక్షాలు సూచించిన కొన్ని సవరణలకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడంతో ఇవాళ ఈ బిల్లుకు చట్టబద్దత లభించింది. పార్లమెంట్ కొత్త క్రిమినల్ బిల్లుకు ఆమోదం తెలపడంతో ఇక మీదట మహిళలపై అత్యాచారం, హత్య, యాసిడ్ దాడులు తదితర నేరాలకు ఉరిశిక్ష, యావజ్జీవ కారాగారం వంటి కఠిన చర్యలు అమలులోకి వస్తాయి. 

  • Loading...

More Telugu News