: పాత ప్రేమకు కొత్త రంగు వేయనున్న షేన్ వార్న్


లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ తన మాజీ ప్రేయసి ఎలిజబెత్ హర్లేతో రెండో ఇన్నింగ్స్ కు సిద్ధమవుతున్నట్టుంది. ఏడాదిగా ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ ఇటీవలే లండన్ లో కెమెరా కంటికి చిక్కారు. దీంతో, ఈ ప్రేమ పక్షులు తమ విరహవేదనకు చెక్ పెట్టాయనుకోవచ్చేమో. భార్యకు విడాకులిచ్చి వార్న్.. భర్తకు గుడ్ బై చెప్పి హర్లే.. ఏళ్ళతరబడి డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఎందుకనో వీరి ప్రేమాయణం బెడిసికొట్టింది. దీంతో, గత సంవత్సరం చెరోదారి పట్టారు.

అప్పట్లో వీరి లవ్ ఎఫైర్ బ్రిటిష్ టాబ్లాయిడ్లకు మాంచి మసాలా అందించేది. బహిరంగంగానే అధర చుంబనాలు, హోటల్ గదుల్లో 'సుదీర్ఘ మంతనాలు'.. అన్నీ కూడా పతాక శీర్షికలకెక్కేవి. వీరు విడిపోయినప్పటి నుంచి కాసింత నిదానించిన టాబ్లాయిడ్లు తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటో దొరికేసరికి రెచ్చిపోయాయి. నటి, మోడల్ అయిన హర్లే.. భారత్ కు చెందిన పారిశ్రామికవేత్త అరుణ్ నాయర్ ను వివాహమాడి కొద్ది నెలలకే విడాకులచ్చింది. అప్పట్లో భారత్ లో జరిగిన వీరి వివాహంపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది.

  • Loading...

More Telugu News