: నా తల్లి నుంచి, హార్వర్డ్ నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్నా: మోడీకి చిదంబరం చురక


ఈ రోజు లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో తాము సాధించిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ, ఇదంతా ఎంతో కష్టపడితేనే సంభవించిందని తెలిపారు. తన తల్లి, తాను చదువుకున్న హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కష్టపడే తత్వాన్ని తాను నేర్చుకున్నానని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, చిదంబరంల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఓ సభలో చిదంబరం మాట్లాడుతూ, గుజరాత్ ముఖ్యమంత్రికి ఆర్థికశాస్త్రం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. దీనికి బదులుగా మరో సభలో మోడీ మాట్లాడుతూ, 'దేశం హార్డ్ వర్క్ మీద నడుస్తుంది కాని, హార్వర్డ్ మీద కాదు' అంటూ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో చిదంబరం లోక్ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News