: రాష్ట్ర విభజన అన్నింటికీ పరిష్కారం కాదు: ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్
రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి ఉన్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ తెలిపారు. కలిసి ఉంటే ప్రగతి సాధ్యమని, విభజన అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. తన అనుగ్రహ యాత్రలో భాగంగా రవిశంకర్ తిరుపతి ఎస్వీయూ క్రీడా మైదానంలో సత్సంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కురుక్షేత్రంగా తయారైందని, విభజన కోసం నేతల మధ్య, ప్రజల మధ్య వివాదాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాజకీయ నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని తాను శ్రీవారిని కోరుకున్నానని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప సంస్కృతి ఉందని, దీనిని మనం గౌరవించాలని ఆయన సూచించారు. ప్రతి వ్యక్తికి ఆలోచనలో స్పష్టత, పనిలో నిబద్ధత, హృదయంలో పవిత్రత అవసరమని ఆయన అన్నారు. హృదయం పవిత్రత లేనివారే ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని రవిశంకర్ చెప్పారు.