: కాసేపట్లో మధ్యంతర బడ్జెట్.. 9వ సారి ప్రవేశపెడుతున్న చిద్దూ
ఆర్థిక మంత్రి చిదంబరం కాసేపట్లో లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చిదంబరం, నేడు ఆ కార్యక్రమాన్ని తొమ్మిదోసారి నిర్వహించనున్నారు. అయితే, సభా సమావేశాలను అడ్డుకుంటామని సీమాంధ్ర కేంద్ర మంత్రులు హెచ్చరించిన నేపథ్యంలో, ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుందో? లేదో? వేచి చూడాలి.