: సమైక్యవాదుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రత
ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో ఏపీఎన్జీవోల మహాధర్నా ఈ రోజు, రేపు జరగనుంది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో రాంలీలా మైదాన్ ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. ఆందోళన కారులు రోడ్లపైకి రాకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నిరసనకారులు పార్లమెంటు వైపు దుసుకురావచ్చన్న సమాచారంతో పార్లమెంటు వెలుపల కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.