: మెక్ కలమ్ 281 బ్యాటింగ్.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్
వెల్లింగ్టన్ లో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తొలి ఇన్నింగ్స్ లో, రెండో ఇన్నింగ్స్ ప్రథమార్థంలో నిప్పులు చెరిగిన భారత బౌలర్లు ఆనక తేలిపోయారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 571 పరుగులు చేసి 325 పరుగుల ఆధిక్యత సాధించింది. నాటౌట్ హీరో బ్రెండన్ మెక్ కలమ్ 281 (28 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులతో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ప్రస్తుతం మెక్ కల్లంతో జతకలిసిన నీషమ్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు వాట్లింగ్ 124 పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.