: కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సమైక్య విద్యార్థి జేఏసీ
ఈ రోజు 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సమైక్యాంధ్ర విద్యార్థి నేతలు వ్యక్తిగతంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, వీరిని కలవడానికి కేసీఆర్ నిరాకరించారు. పార్లమెంటు సమావేశాలున్నందున కలవలేనని... మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత కలుద్దామని సమాచారం పంపించారు. దీంతో, విద్యార్థి నేతలు కేసీఆర్ కు అందజేయాలని పుష్పాలను సెక్యూరిటీకి ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ, గతంలో మంత్రిగా పనిచేసిన కేసీఆర్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేయాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.