: వైఎస్సార్సీపీ 'సమైక్య ధర్నా' నేడే
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్సీపీ 'సమైక్య ధర్నా'ను చేపట్టనుంది. ఈ ధర్నా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి వైకాపా అధినేత జగన్ తో పాటు, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్నారు.