: నైజీరియాలో తీవ్రవాదుల మారణకాండ: వంద మంది మృతి
నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలోని ఇజ్గే గ్రామంలో తీవ్రవాదులు జరిపిన మారణకాండలో వంద మందికి పైగా గ్రామస్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సుమారు వంద మంది తీవ్రవాదులు గ్రామంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడులకు పాల్పడినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఐదు గంటలపాటు ఈ దాడులను కొనసాగించినట్టు సమాచారం.