: నేడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షష్ఠి పూర్తి
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేటితో 60ఏళ్లు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రక్త, అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ విద్యార్ధి, యువజన విభాగాలు పిలుపునిచ్చాయి. తెలంగాణభవన్ లో ఈ రోజు ఉదయం రక్తదాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు. ఈ రోజు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున ఉదయమే వేడుకలను జరపాలని భావిస్తున్నారు.