: రైళ్లలో ఎలుకల సమస్యకు హైదరాబాదీ సంస్థ పరిష్కారం
రైళ్లలో, రైల్వే స్టేషన్లలో భారీగా పెరిగిపోతున్న ఎలుకలను నిర్మూలించడం రైల్వే శాఖకు పెద్ద సవాలుగా మారింది. ఇవి చేసే నష్టం అంతా ఇంతా కాదు. రైళ్లలో ఇవి విద్యుత్ వైర్లను కొట్టడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను ఇటీవలే మీడియా ద్వారా తెలుసుకున్న హైదరాబాద్ కు చెందిన హైదరాబాద్ సైన్స్ సొసైటీ ఒక పరిష్కారంతో ముందుకు వచ్చింది.
దీనిని సైన్స్ సొసైటీ డైరెక్టర్ సంజర్ అలీఖాన్ తెలిపారు. 'ఎలుకలను ఆకర్షించేందుకు మేమొక చాంబర్ (చిన్న గది)ను రూపొందించాం. ఎలుక ఇందులోకి వచ్చిన వెంటనే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దానిని గుర్తిస్తుంది. క్షణాల్లోనే ఇసుక అత్యధిక పీడనంతో కూడిన గాలితో కలిసి విస్ఫోటనం చెందుతుంది. అంత ఒత్తిడితో వచ్చి ఇసుక తగలడంతో ఎలుకలు మరణిస్తాయి. ఇలా ఒక నిమిషంలో నాలుగు ఎలుకలను ఆ చాంబర్ చంపగలదు' అని ఖాన్ చెప్పారు. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది.