: దూకుడు ప్రదర్శిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ


దేశంలోని అవినీతిని ఊడ్చి పారేస్తామంటూ తెరపైకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానుండగా, ప్రముఖులపై పోటీకి అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ జాబితాను మీడియాకు విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో లోక్ సభకూ పోటీ చేయాలని నిర్ణయించిన ఆమ్ ఆద్మీ ప్రముఖ రాజకీయనేతలకు సవాల్ విసురుతోంది. 20 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో.. కుమార్ విశ్వాస్ అమేథీలో రాహుల్ గాంధీపై, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ పై చాందినీ చౌక్ లో అశుతోష్, ములాయం సింగ్ యాదవ్ పై బాబా హర్ దేవ్, కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పై ముకుల్ త్రిపాఠీ, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీపై అంజలి దమానియా, క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ పై ఖాలిద్ పర్వేజ్ పోటీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News