: ఇది తెలుగుజాతి సమస్య, జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిందే: బాబు


రాష్ట్ర విభజన అంశం తెలుగుజాతి సమస్య అని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిందే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. విభజన వ్యవహారం కాంగ్రెస్ సొంతింటి వ్యవహారం కాదని, జాతీయ సమస్య అని స్పష్టం చేశారు. సోనియా ముమ్మాటికీ గాడ్సే అని పునరుద్ఘాటించారు. సోనియా ఇష్టప్రకారం చేయడం కుదరదని బాబు తేల్చి చెప్పారు. అధికార దాహంతో యువత కలలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిరిన తర్వాతే ముందుకెళ్ళాలని స్పష్టం చేశారు. చంఢీగఢ్ నుంచి ఢిల్లీ చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో బాబు.. సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను కలిశారు. ఆయన విభజన బిల్లుకు తాము వ్యతిరేకమే అని బాబుకు చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News