: 'పెప్పర్ స్ప్రే' ఘటనపై విచారణకు ఆదేశించిన లోక్ సభ స్పీకర్
రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ మీరా కుమార్ విచారణకు ఆదేశించారు. పార్లమెంటు నియమావళి కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్పీకర్ పేర్కొన్నారు. గురువారం బిల్లును సభలో ప్రవేశపెడుతుండగా.. సీమాంధ్ర సభ్యులు తీవ్ర ఆందోళనకు యత్నించారు. అదే సమయంలో తెలంగాణ ఎంపీలకు విజయవాడ ఎంపీ లగడపాటికి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో లగడపాటి పెప్పర్ స్ప్రే గాల్లోకి చిమ్మడంతో ఎంపీలందరూ పరుగులు పెట్టారు. మరోవైపు టీడీపీ ఎంపీ మోదుగుల టేబుల్ పైకెక్కి మైకులు విరగ్గొట్టి కడుపులో పొడుచుకునేందుకు యత్నించారు.