: బాబు గర్జన ధాటికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవుతున్నాయి: యనమల
టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైఎస్సార్సీపీపై వాగ్బాణాలు సంధించారు. చంద్రబాబు ప్రజాగర్జన ధాటికి వైఎస్సార్సీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవుతున్నాయని ఎద్దేవా చేశారు. బాబుకు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేక జగన్ పార్టీ నేతలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నిన సోనియాతో కుమ్మక్కైన జగన్ ను శిక్షించేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారని యనమల తెలిపారు. ఇక సీఎం కిరణ్ కుమార్ ఎప్పటికప్పుడు రాజీనామా వాయిదా వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫైళ్ళపై సంతకాలు పెడుతూ ట్రెజరీని ఖాళీ చేసే పనిలో తలమునకలయ్యారని విమర్శించారు.