: లోక్ సభలో కేంద్రం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదు: ప్రకాశ్ కారత్
కేంద్రం లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ అంటున్నారు. బిల్లును ప్రవేశపెట్టామని చెబుతున్న ప్రభుత్వ వాదనను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీ మొదటి నుంచి సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే.