: సీఎం పార్టీ పెడుతున్నట్టు సమాచారం లేదు, కాంగ్రెస్ లోనే ఉంటాం: రామచంద్రయ్య
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టనున్నట్టు తమకు సమాచారం లేదని మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు. తాము మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక, నిన్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మంత్రి ఆక్షేపించారు. సోనియాను గాడ్సేతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు. జగన్ పైనా ధ్వజమెత్తిన రామచంద్రయ్య.. లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తిని ఇంకా ఈ రాష్ట్రంలో కొందరు ఆరాధిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.