: క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ తో కోట్ల భేటీ
ఈ ఉదయం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ తో కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై వారు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నేడు సీఎం రాజీనామా చేయవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎంతో భేటీ అయిన వారిలో మంత్రి పితాని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు.