: సీబీఐ సోదాలు నిర్వహించడం దురదృష్టకరం: ప్రధాని
డీఎంకే నేత స్టాలిన్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించడం దురదృష్టకరమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ సమయంలో సోదాలు జరగడం తమను కలవరపరచిందన్నారు. ఈ విషయమై వార్తలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రమంత్రులు చిదంబరం, నారాయణస్వామితో చర్చించినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే, డీఆర్ఐ ఫిర్యాదు మేరకు విదేశీకారు గురించి విచారించేందుకు మాత్రమే తాము స్టాలిన్ నివాసానికి వచ్చామని సీబీఐ తెలిపి, అనంతరం ఉదయం పదిన్నర ప్రాంతంలోనే సోదాలు నిలిపివేయటం విశేషం.