: సమాచార కమిషనర్ తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు
సమాచార కమిషనర్ తాంతియా కుమారి ఈ రోజు విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు సిండికేట్లుగా ఏర్పడి సమాచార చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆమె అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాకుండా కొన్ని ఆర్థిక బిల్లులను అడ్డదారిలో ఆమోదింప చేయించుకుంటున్నారని ఆమె చెప్పారు. అయితే, ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని ఆమె వెల్లడించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తాంతియా కుమారి చెప్పారు.