: ఢిల్లీ అసెంబ్లీని సస్పెండ్ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్


ఢిల్లీ అసెంబ్లీని సుప్త చేతనావస్థ (సస్పెన్షన్) లో ఉంచాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నిర్ణయించారు. అంతకుముందు రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలి లేదా రాష్ట్రపతి పాలన విధించాలంటూ చేసిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దాంతో, నేటి నుంచి ఎమ్మెల్యేలంతా అధికారంలో కొనసాగినప్పటికీ వారికి చట్టాలు చేసే అధికారం మాత్రం ఉండదు. రాష్ట్రపతి నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అంతేకాక, ఢిల్లీకి సంబంధించిన శాసనాధికారాలు పార్లమెంటు ఆధీనంలోకి వెళతాయి. అప్పుడు ఢిల్లీకి సంబంధించిన చట్టాలు చేసే అధికారం కూడా పార్లమెంటు తన చేతుల్లోకి తీసుకుంటుంది.

  • Loading...

More Telugu News