: సోనియమ్మ చింతిస్తోందట!
యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఓ విషయంలో తీవ్రంగా చింతిస్తోందట. కొచ్చిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా.. తమ పాలన కాలంలో మహిళా బిల్లుకు మోక్షం కలిగించలేకపోయామని వాపోయారు. అందుకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఓ వైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయని, ఈ తరుణంలో మహిళా బిల్లును ఆమోదింపచేయడం తమకు సాధ్యం కాలేదని వివరణ ఇచ్చారు. బిల్లుకు సభలో తగిన మద్దతు దొరకలేదని పేర్కొన్నారు. కాగా, ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇక, మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా కోసం తమ పార్టీ పోరాటం ఆపబోదని కాంగ్రెస్ అధినేత్రి స్పష్టం చేశారు.