: కేజ్రీవాల్ మార్కు పవర్ పంచ్ లు ఇవిగో..


అరవింద్ కేజ్రీవాల్.. సీఎం పదవిని తృణప్రాయంగా త్యజించి, సామాన్యుడి గుండెల్లో మరింత ఉన్నతస్థానానికి ఎదిగిన నయా రాజకీయవేత్త. జన్ లోక్ పాల్ బిల్లుకు పార్టీలతో సహా గవర్నర్ కూడా మోకాలడ్డడాన్ని జీర్ణించుకోలేని కేజ్రీవాల్ నోటి నుంచి జాలువారిన కొన్ని పవర్ పంచ్ లు..

1. జన్ లోక్ పాల్ బిల్లు ఆమోదం కోసం నా పదవిని 1000 సార్లైనా త్యజించేందుకు సిద్ధం. అవినీతిని కూకటివేళ్ళతో సహా పెకలించేందుకు నా ప్రాణాలైనా ఇవ్వగలను.

2. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటి నుంచో తెర వెనుక కుట్రకు సన్నాహాలు చేస్తున్నాయి. అది నేడు బయటపడింది.

3. మేం రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. తత్ఫలితమే అంబానీతో కలిసి ఆ రెండు పార్టీలు జన్ లోక్ పాల్ బిల్లును అడ్డుకున్నాయి.

4. కాంగ్రెస్ తన దుకాణమని ముఖేశ్ అంబానీ చెబుతున్నారు. నేను ఆ షాపును ఎప్పుడైనా మూయించగలను. పదేళ్ళుగా అంబానీ యూపీఏ ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్నారు. ఏడాదిగా ఆయన మోడీకి మద్దతిస్తున్నారు.

5. కేంద్రం తీరు చూస్తుంటే బ్రిటిషర్ల మాదిరిగానూ, లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరి వైస్రాయ్ నూ తలపిస్తోంది.

6. ముఖేశ్ అంబానీపై మేం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. దాన్ని వాళ్ళు రాజ్యంగ వ్యతిరేకం అంటున్నారు. మేం జన్ లోక్ పాల్ బిల్లుకు ఆమోద ముద్ర వేయించుకోవాలని భావించాం. దాన్నీ వారు రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. మీ తప్పుడు పనులన్నీ రాజ్యాంగబద్ధమా? నిజాయతీగా మేం చేసేవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమా?

7.బీజేపీ నేతలు మా మంత్రికి గాజులు కానుకగా ఇచ్చారు. మహిళల పట్ల బీజేపీ నేతలకు ఏమన్నా గౌరవం ఉంటే ఇలా చేస్తారా?

8. మాకు పాలించడం తెలీదని పెద్ద పార్టీలు అన్నాయి. కానీ, ఐదు రోజుల్లో విద్యుత్ టారిఫ్ ను తగ్గించాం. వారు ఐదేళ్ళలో చేయలేనిది మేం కొద్ది రోజుల్లోనే చేసి చూపించాం.

9. గత 49 రోజులుగా మా మంత్రులం ఎవ్వరమూ సరిగ్గా నిద్రపోలేదు.

10. తప్పులుంటే మన్నించండి. ఎంతయినా, మేమూ మానవమాత్రులమే కదా.

  • Loading...

More Telugu News