: ఒక సమస్య పరిష్కరించమంటే.. వంద సృష్టించారు: చంద్రబాబు
ఒక సమస్యను సజావుగా పరిష్కరించమంటే... కాంగ్రెస్ పార్టీ వంద సమస్యలను సృష్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కాంగ్రెస్ పాలన అత్యంత దారుణ స్థితికి చేరుకుందని అన్నారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో జరగనున్న ప్రజాగర్జన సభకు వెళ్తూ, గన్నవరం (విజయవాడ) విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గృహిణిగా ఉన్న సోనియాకు... రాష్ట్ర సమస్యలు ఏమి తెలుసని ప్రశ్నించారు. పార్లమెంటులో జరిగిన ఘటనపై సోనియా, మన్మోహన్ లు ఇంతవరకు ఎందుకు స్పందించలేదని అన్నారు.