: విజయ్ కాంత్ దుమ్ముదులిపేస్తాడంటున్న డీఎంకే చీఫ్
డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి.. డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ కాంత్ కు గాలం వేస్తున్నాడు! విజయ్ కాంత్ ఓ స్టంట్ యాక్టర్ అని, ఆయనకు తన ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించాలో బాగా తెలుసని కరుణానిధి అన్నారు. సినిమాల్లో విలన్ల నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటాడో, రాజకీయాల్లోనూ అవే ఎత్తుగడలు పాటిస్తాడని చెప్పుకొచ్చారు. తిరుచ్చిలో జరుగుతున్న డీఎంకే రెండ్రోజుల సమావేశాల్లో మాట్లాడుతూ కరుణ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమిలో చేరేందుకు డీఎండీకేను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. తమిళనాడును పురోగామి పథంలో నడిపించాలని బలమైన వాంఛ ఉన్న వారెవరైనా తమ కూటమిలో చేరొచ్చని, విజయ్ కాంత్ కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పారు. కాంగ్రెస్ కూడా తాజా కూటమిలో చేరనుందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ, అది సాధ్యమేనని పేర్కొన్నారు.