: లోక్ సభలో సీమాంధ్ర ఎంపీల ప్రవర్తన సరిగా లేదు: కేంద్ర మంత్రి పనబాక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమంటున్న బీజేపీతో టీడీపీ అధినేత జత కట్టడం సమర్థనీయం కాదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అన్నారు. ఈ రోజు ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టడం తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎంపీలు చేసిన ప్రయత్నాలు మంచివి కాదని అన్నారు. పార్లమెంటులో జరిగిన పెప్పర్ స్ప్రే ఉదంతంతో పలువురు ఇబ్బంది పడ్డారని... తాను కూడా బాధితురాలినే అని ఆమె తెలిపారు.