: నేడు సైకిలెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే


తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సైకిలెక్కనున్నారు. నిన్న సాయంత్రమే ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యంతో కలసి ఆయన చంద్రబాబు వద్దకు వచ్చారు. ఈ రోజు తాడేపల్లిగూడెంలో జరగనున్న ప్రజాగర్జన సభలో చంద్రబాబు సమక్షంలో బండారు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2009లో పీఆర్పీ తరపున గెలిచిన బండారు, ఆ తర్వాత పార్టీతో పాటే కాంగ్రెస్ లో చేరారు. అలాగే, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ కూడా త్వరలోనే టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన చంద్రబాబుతో ఈ వ్యవహారానికి సంబంధించి చర్చలు కూడా జరిపారు.

  • Loading...

More Telugu News