: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ ను కలసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. జన్ లోక్ పాల్ బిల్లును శాసనసభలో ప్రతిపక్షాలు తిరస్కరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి తొలిసారి అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 49 రోజులు మాత్రమే సాగింది. డిసెంబర్ 28, 2013 న కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో శాసనసభను రద్దు చేసి ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫారసు చేసింది.