: చవకబారు ప్రచారం కోసమే కేజ్రీవాల్ వెంపర్లాడుతున్నారు: కేంద్రమంత్రి నారాయణస్వామి


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి నారాయణ స్వామి మండిపడుతున్నారు. చవకబారు ప్రచారం కోసమే కేజ్రీవాల్ వెంపర్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జన్ లోక్ పాల్ బిల్లు కోసం పట్టుపడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి అన్నారు. చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని, నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆయన హితవు పలికారు. ఇకనైనా, కేజ్రీవాల్ చవకబారు ప్రచారం మానుకొని, ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని నారాయణస్వామి సూచించారు.

  • Loading...

More Telugu News