: ఎంపీల ఘటనపై విచారణ కమిటీ
గురువారం పార్లమెంటులో జరిగిన ఘటనలకు సంబంధించి విచారణ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ స్పీకర్ అధ్యక్షతన సెక్యూరిటీ కమిటీని నియమించారు. సోమవారం సెక్యూరిటీ కమిటీ సమావేశమై ఘటనపై విచారణ చేపట్టనుంది. విచారణ పూర్తయిన అనంతరం ఘటనకు కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.