: కూల్ డ్రింకులో మత్తుమందు కలిపిచ్చి మరీ.. స్నేహితురాలిపై అత్యాచారం!


22 ఏళ్ల యువతిపై ఆమె తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వైద్య కోర్సు చదువుతున్న ఆ విద్యార్థినికి శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని సంగనీర్ నగరంలో జరిగింది. బాధితురాలు ఈ నెల మొదటి వారంలో నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు సంగనీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ కుమార్, యోగేంద్ర కుమార్, వీరేంద్ర కుమార్ లను నిందితులుగా భావిస్తున్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురిలో ఒకరు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

  • Loading...

More Telugu News