: ఈ మూడింటికి ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు: కావూరి
రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మూడు డిమాండ్లు ప్రతిపాదించారు. ఆ మూడు డిమాండ్లకు ఒప్పుకుంటే రాష్ట్ర విభజనపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అందులో ఒకటి.. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపటం, రెండవది భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపటం, మూడవది హైదరాబాదును పదేళ్లు యూటీగా చేయటం. ఈ మూడు ప్రతిపాదనలకు అంగీకరిస్తే విభజనకు కొంత సహకరిస్తామని కావూరి తెలిపారు. అయితే, జీవోఎంను ఏది అడిగినా తెలంగాణ వాళ్లు ఒప్పుకోవడం లేదని అంటున్నారని చెప్పిన ఆయన, అలాంటప్పుడు బిల్లుకు తామెలా ఒప్పుకుంటామన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఎవర్ని అడిగినా కాంగ్రెస్ లేదనే చెబుతారన్నారు.