: చైనా అలా.. మనం ఇలా..


జనాభా విషయంలో మనకన్నా ముందున్న చైనా, పురోగతి అంశంలోనూ అదే జోరు కనబరుస్తుండడం తక్కిన ప్రపంచానికో అద్భుతం. చైనాకు ఒక్కరాత్రిలో సాధ్యంకాలేదీ అభివృద్ధి. క్షేత్రస్థాయి నుంచి శ్రమిస్తే, ఫలితాలు ఉన్నతస్థాయిలో ప్రతిబింబించాయి. చైనాతో రెండు మూడు విషయాల్లో పోటీ పడే మనం చాలా విషయాల్లో ఎక్కడో ఉన్నాం. మనమింకా మెట్రోరైలు వ్యవస్థ కోసం ఎదురు చూపులు చూస్తుండగా, చైనా జలాంతర్భాగంలో భారీ రవాణా మార్గం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదో రైలు మార్గం కాగా, దీని ద్వారా కార్లు తదితర పారిశ్రామిక ఉత్పత్తులను రవాణా చేయాలని జనచైనా సంకల్పించింది. దలియాన్ (లియోనింగ్ ప్రావిన్స్) నుంచి యాంటాయ్ (షాండోంగ్ ప్రావిన్స్) వరకు ఈ సూపర్ టన్నెల్ నిర్మించనున్నారు. ఇందుకోసం 3600 కోట్ల డాలర్ల నిధులు కేటాయించారు. 123 కిలోమీటర్ల ఈ మహా ప్రాజెక్టును 2020 నాటికి పూర్తి చేయాలని చైనా నిర్ణయించింది.

  • Loading...

More Telugu News