: తెనాలి నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర
వైఎస్ఆర్ తనయ .. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పాదయాత్ర ఇవాళ గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రారంభమైంది. దీంతో ఆమె పాదయాత్ర నేటికి 97వరోజుకు చేరినట్లైంది. ఐతానగర్ నుంచి బస్ స్టాండ్, కఠివరం క్రాస్ రోడ్, ఆటోనగర్ మీదుగా షర్మిల తన పాదయాత్ర చేసి భోజనవిరామం తీసుకుంటారు. అనంతరం నందివెలుగు, చింతలపూడి మీదుగా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల వరకూ ఇవాళ ఆమె పాదయాత్ర చేస్తారు.