: వారిది అవకాశవాద బానిసత్వం: కరుణానిధి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా వామపక్షాలు ముందుకు తీసుకురావడంపై డీఎంకే అధినేత కరుణానిధి అభ్యంతరం వ్యక్తం చేశారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారని, వామపక్షాలది అవకాశవాద బానిసత్వంగా వ్యాఖ్యానించారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో కలిసి పోటీ చేసేందుకు ఏఐడీఎంకే, సీపీఎం, సీపీఐలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తమిళుల ప్రయోజనాలను కాపాడే పార్టీలతోనే రానున్న ఎన్నికలలో కలిసి సాగుతామని కరుణానిధి చెప్పారు.