: కావూరి నివాసంలో ముగిసిన సీమాంధ్ర ఎంపీల భేటీ
ఢిల్లీలోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో తమ భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా వీరు చర్చించారు. వివిధ రాజకీయ పక్షాల జాతీయ నేతలను కలవాలని ఈ సమావేశంలో సీమాంధ్ర ఎంపీలు నిర్ణయించారు.