: ప్రేమికులకు పండగలాంటి తీర్పు


ప్రేమికులకు సంతోషకరమైన తీర్పును లక్నో హైకోర్టు నిన్న జారీ చేసింది. అన్ని పార్కుల వద్ద భద్రతా సిబ్బందిని నియమించాలని, ఫిబ్రవరి 14న ప్రేమికులను, యువతను అనుమతించకూడదని, కేవలం సాధారణ ప్రజలు వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లేందుకే అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వానికి, లక్నో డెవలప్ మెంట్ అథారిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విజయ్ సింగ్ అనే పౌరుడు లక్నో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాడు.

దీనిని విచారించిన హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం పౌరుల ప్రాథమిక స్వేచ్చా హక్కు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో శాంతి భద్రతలు, సభ్యత, నైతికతను కాపాడడంపై ఈ హక్కు ఆధారపడి ఉంటుందని పేర్కొంటూ పిటిషనర్ కోరినట్లుగా ఆదేశాలు జారీ చేయడానికి తిరస్కరించింది.

  • Loading...

More Telugu News