: కేపీ దూకుడు మళ్ళీ మొదలైంది


వివాదాలకు మారుపేరైన క్రికెటర్లలో కెవిన్ పీటర్సన్ ది ప్రత్యేకస్థానం. ఎందుకంటే, అతను పెద్దగా ప్రతిభావంతుడు కాకపోయి ఉంటే ఎప్పుడో తెరమరుగై ఉండేవాడు. ఎన్నిసార్లు ఇంగ్లండ్ క్రికెట్ యాజమాన్యానికి తలనొప్పులు తెచ్చిపెట్టినా, అతని టాలెంటే జట్టులో స్థానం నిలబెట్టింది. సొంత జట్టు ఆటగాళ్లపై ప్రత్యర్థి జట్టుకు మెసేజిలు పంపడం, కెప్టెన్ ఒకటి చెబితే తాను ఇంకొకటి చేయడం కేపీకే చెల్లు. ఇటీవల కేపీ దురుసుతనం పరాకాష్టకు చేరడంతో అతన్ని తప్పించడం మినహా ఇంగ్లిష్ క్రికెట్ బోర్డుకు మరో మార్గం లేకపోయింది.

ఇంగ్లిష్ క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయినా ఐపీఎల్ లో రూ.9 కోట్లకు అమ్ముడుపోయిన ఈ దక్షిణాఫ్రికా సంతతి క్రికెటర్ మళ్ళీ తన పాత పంథాలో నడుస్తున్నట్టుంది. తాజా సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఎంపికైన పీటర్సన్ జట్టుకు కెప్టెన్సీ చేయాలనుందంటున్నాడు. జట్టులో కుర్రాళ్ళు ఎక్కువమంది ఉన్నారని, వాళ్ళకి దిశానిర్దేశం చేస్తానని అంటున్నాడు. మరి డెవిల్స్ యాజమాన్యం కేపీ కోరికనను మన్నిస్తుందో.. దూకుడు తగ్గించమని సైలెంట్ గా క్లాస్ పీకుతుందో చూడాలి.

వరల్డ్ టాప్ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ఢిల్లీ జట్టుకు హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పుడందరి దృష్టి ఈ అండర్ డాగ్ పైనే ఉంది. ఆ జట్టు భాగ్యరేఖలు ఈ సీజన్ తోనైనా మారాలని అభిమానులు ఆశిస్తున్నారు.

  • Loading...

More Telugu News