: లోక్ సభ ఘటనపై మాజీ స్పీకర్ స్పందన
లోక్ సభ సాక్షిగా సభలో చోటు చేసుకున్న ఘటనపై మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికే చేటన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, పార్లమెంటరీ సంప్రదాయాలు పాటించాలని సూచించారు.