: తెలంగాణ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం!: కేంద్ర మంత్రి కమల్ నాథ్
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రవర్తిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి కమల్ నాథ్ ఆరోపించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశంలో బీజేపీ వేసుకున్న ముసుగు ఇవాళ తొలగిపోయిందని ఆయన అన్నారు. అయితే బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ.. సభలో ఆమోదింపజేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
కాగా, బుధవారం ప్రధానితో బీజేపీ నేతల విందు సమావేశమైన అనంతరం బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతిస్తోందని ఆయన ప్రకటించారు. అయితే, 24 గంటలు గడవక ముందే.. ఆ పార్టీ బిల్లుకు వ్యతిరేకమంటూ ఇప్పుడు ఆయనే చెప్పారు. పొంతన లేని కమల్ నాథ్ వ్యాఖ్యలు ప్రస్తుత తరుణంలో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.