: భారత్ కు మిగిలేది రక్తకన్నీరే: కివీస్ కెప్టెన్


టీమిండియా అంటే పసికూనలకూ లోకువైపోతోంది. తాజాగా, ఒక్కటంటే ఒక్క విజయానికీ నిరాకరించి భారత్ కు గర్వభంగం చేసిన న్యూజిలాండ్ రేపటి నుంచి మరో పోరాటానికి సిద్ధం అవుతోంది. వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టీమిండియా, కివీస్ మధ్య రేపు రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ సందర్భంగా ఆతిథ్య జట్టు సారథి బ్రెండన్ మెకల్లమ్ భారత్ కు హెచ్చరికలు జారీచేశాడు. ధోనీ సేన విజయంతో తిరిగివెళ్ళడం కల్ల అని స్పష్టం చేశాడు. రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంతో ఉన్న న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్ లోనూ అదే ఒరవడి కొనసాగిస్తుందని మెకల్లమ్ తెలిపాడు. తామెప్పుడూ గెలిచేందుకే ప్రయత్నిస్తుంటామని, పిచ్ పై మరింత బౌన్స్ రాబట్టి భారత్ ను బెంబేలెత్తిస్తామని చెప్పాడు.

  • Loading...

More Telugu News