: 'పార్లమెంటు' కంటే 'సి' గ్రేడ్ సినిమా నయమంటున్న బాలీవుడ్ దర్శకుడు


తెలంగాణ అంశంపై లోక్ సభలో నేడు చోటు చేసుకున్న పరిణామాలు బాలీవుడ్ వర్గాలనూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. కేంద్రం హడావుడిగా బిల్లు ప్రవేశపెట్టడం, లగడపాటి పెప్పర్ స్ప్రే ప్రయోగం, మోదుగుల కడుపులో పొడుచుకునే యత్నం, కొనకళ్ళ కుప్పకూలడం.. వంటి సన్నివేశాలపై బాలీవుడ్ ప్రముఖలు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. పార్లమెంటులో జరుగుతున్నవి చూస్తుంటే ఓ 'సి' గ్రేడ్ సినిమానే నయమనిపిస్తోందని దర్శకుడు మధుర్ బండార్కర్ వ్యాఖ్యానించారు. నేడు బ్లాక్ డే అని, ఇలాంటి చర్యలు సిగ్గుచేటని పేర్కొన్నారు. మరో ప్రముఖ దర్శకనటుడు శేఖర్ కపూర్ మాట్లాడుతూ, ఎవరికి మద్దతివ్వాలో అర్థం కాని పరిస్థితి ఉత్పన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News