: అమెరికా దృష్టిలో మోడీ ఇప్పుడు గెలుపుగుర్రం
గతకొంతకాలంగా గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై అనధికార ఆంక్షలు కొనసాగించిన అగ్రరాజ్యం అమెరికా రూటు మార్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న మోడీ గెలిచేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న సర్వేల సారాంశం అమెరికా వైఖరిలో మార్పు తెచ్చినట్టుంది. అందుకే, ఆయనను ఇప్పటి నుంచే మంచి చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో నేడు అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గాంధీనగర్ లో మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోడీ.. పావెల్ కు ఓ అందమైన పూల బొకేను అందించి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. వారి భేటీ వివరాలు ఇంకా మీడియాకు వెల్లడికాలేదు.