: క్రికెట్ ట్రైనింగ్ క్యాంపులో దారుణం
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుమారుణ్ణి పొట్టనబెట్టుకున్నాడు. క్రికెట్ ట్రైనింగ్ క్యాంపులో సాధన చేస్తున్న ల్యూక్ బ్యాటీ అనే 11 ఏళ్ళ బాలుడిని అతడి తండ్రి గ్రెగ్ క్రికెట్ బ్యాట్ తో బలంగా మోదాడు. దీంతో, ఆ చిన్నారి తీవ్రగాయాలతో మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి రాగా, గ్రెగ్ వారిపై పెప్పర్ స్ప్రే చల్లి, కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో, ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆ కిరాతక తండ్రి కుప్పకూలిపోయాడు. అతడిని ఎయిర్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ కలహాల కారణంగానే అతడు తన కుమారుడిని చంపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.