: విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాం: గండ్ర


అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వెల్లడించారు. ఈరోజు జరిగిన సీఎల్పీ భేటిలో ఆయన పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని సీఎల్పీలో నిర్ణయించామని తెలిపారు.

ఇంకా, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని రేపటి నుంచి సమీక్షిస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాల ప్రచారంపై కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోని సబ్ కమిటీ ఈ నెలాఖరులోగా నివేదిక అందజేస్తుందని గండ్ర పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News