: ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన అనామకుడు
అతడి పేరు రిషి ధావన్. వయసు 23 ఏళ్ళు. ఈ హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు మునుపెన్నడూ వార్తల్లో నిలిచిన దాఖలాల్లేవు. కానీ, నేడు ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. నేడు జరిగిన వేలంలో ఈ యువ ఆల్ రౌండర్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.3 కోట్లు పోసి కొనుక్కుంది. ఇంతజేసీ ఇతని కనీస ధర రూ.20 లక్షలే. ఇప్పటివరకు కెరీర్లో 23 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడిన రిషి 1093 పరుగులు చేసి 96 వికెట్లు తీశాడు. ప్రధానంగా ఫాస్ట్ బౌలర్ అయిన ఈ హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు మిడిలార్డర్లో ఉపయుక్తమైన పరుగులు చేయగలడు. ఇదే ఇతనికి ఐపీఎల్ లో అక్కరకొచ్చింది. ధావన్ 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు ఎంపికైనా బెంచ్ కే పరిమితమయ్యాడు.