: మెక్సికో మాజీ అధ్యక్షుడు.. షారుక్ ఖాన్ కు అభిమాని


సినీ నటులకు అభిమానులు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ నటులకు అభిమానులు ఖండాంతరాల్లోనూ ఉన్నారు. ఇదే క్రమంలో మెక్సికో మాజీ అధ్యక్షుడు విన్సెంట్ ఫాక్స్ క్యుసెడా (2000-06) కు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అంటే ఎనలేని అభిమానం. దాంతో, ఈ నెల పదకొండున ముంబయి పర్యటనకు వచ్చిన ఆయన చెంబూరులోని ఆర్ కె స్టూడియోలో 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం షూటింగులో ఉన్న షారుక్ ను కలిశారట. విన్సెంట్ తో పాటు ఆయన భార్య, ఇండియాలో ప్రస్తుత మెక్సికన్ రాయబారి కూడా ఉన్నారు. కొద్దిసేపు పలు విషయాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారని, షారుక్ చిత్రాల గురించి తనకు తెలిసిన విషయాలను విన్సెంట్ మాట్లాడారట.

  • Loading...

More Telugu News