: పార్లమెంటు దుర్భేద్యం.. భారీగా మోహరించిన మార్షల్, భద్రతాదళాలు
రాష్ట్ర విభజన బిల్లును నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంటు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆత్మాహుతికి సైతం అంటూ సీమాంధ్ర ఎంపీలు హెచ్చరించిన నేపథ్యంలో, భద్రత పెంచారు. సభలో భారీ సంఖ్యలో మార్షల్స్ మోహరించారు. అలాగే పార్లమెంటు ఆవరణలో భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరింపజేశారు. దీనికితోడు, సభలోకి వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ వారెవరికీ పాసులు మంజూరు చేయడం లేదు. ఫైరింజన్లు, అంబులెన్సులను కూడా అందుబాటులో ఉంచారు.